గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, 3D ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే. శాకుంతలం మూవీ ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న సందర్భంగాస్టార్ హీరోయిన్ సమంత సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. .శాకుంతలం సినిమాకు సమంత క్రేజ్ ని చూసే హిందీలో మార్కెట్ జరుగుతున్నట్టు సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ … నిజానికి సినిమా మొదలు పెట్టడానికి అనుకున్న బడ్జెట్ కన్నా పూర్తి చేసే సరికి ఎక్కువైందనీ , ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా శాకుంతలం అనీ చెప్పారు. శాకుంతలం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: