మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను అలానే వేదికను ఖరారు చేశారు మేకర్స్. ఏప్రిల్ 1వ తేదీన హైద్రాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: