ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

dhamki movie first week collections

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకొని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ ఫస్ట్ వీక్ లో మొత్తంగా ఈమూవీ రూ. 21.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం విశ్వక్ శేన్ తన తరువాత సినిమాలపై ఫోకస్ ను పెట్టనున్నాడు. విద్యాధర్‌ దర్శకత్వంలో అడ్వెంచరస్‌ ఫాంటసీ నేపథ్యంలో గామి అనే ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా. ఇక ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దీనితో పాటు తన పుట్టిన రోజు సందర్భంగా తన 11వ సినిమాను ప్రకటించారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =