మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందే చూశాం. ఫుల్ మాస్ అవతార్ లో రవితేజ రెచ్చిపోయాడు. టీజర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం రావణాసుర టీమ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇటీవలే షూట్ చేయబడినట్టు తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూ ఉగాదికి ప్రసారం చేయనున్నారట.
కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: