సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుష్ప 2 మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ రన్నింగ్ లో ఉంది. ఎర్రమంజిల్ కాలనీలో చిత్రీకరణ జరుగుతోంది. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు, బన్నీతో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం. రష్మిక మందన్న కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. అల్లు అర్జున్, రష్మిక లపై ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు దర్శకుడు చిత్రీకరిస్తున్నట్లు, ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే బ్యాంకాక్ అడవుల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారనీ, దాదాపు నెల రోజులకు పైగా అక్కడే షూటింగ్ ఉంటుందనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: