పెళ్లి చూపులు సినిమాతో పరిచయమై ఆసినిమాతో తన కామెడీతో అందరికీ కనెక్ట్ అయ్యాడు ప్రియదర్శి. ఇక ఆ సినిమా తరవాత తను వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మల్లేశం లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియదర్శి.. ఈసారి బలగం అంటూ మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈసినిమా వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అవుతుంది. మార్చి 3న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి లాభాలను అందిస్తుంది మేకర్స్ కు. ఇక తాజాగా బలగం సక్సెస్ పై ప్రియదర్శి కూడా స్పందిస్తూ పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఈసినిమాపై ఈసినిమా కమర్షియల్ సినిమాకి ఆల్టర్నేటివ్ డెఫినిషన్ అని.. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచి, హృదయాన్ని కదిలించే, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం అంటూ చెప్పుకొచ్చారు.
Ok darlings, let’s have an alternate definition to “Commercial Cinema”
“A heart-warming and critically acclaimed movie that also performs well at the box office” #Balagam
We couldn’t have done it without you, dear audience! https://t.co/rQ4Vp5jJCW
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) March 14, 2023
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: