టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది.ఇప్పటికే ట్రైలర్ 1.0 సినిమాపై అంచనాలను పెంచగా.. ఇప్పుడు ట్రైలర్ 2.0 అంటూ మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఫార్మా రంగం చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు.. అని విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలెట్‌గా గా నిలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ట్రైలర్ లాంచ్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కి మధ్య ఒక కేటగిరీ వుంటుంది. ఒక డ్రైవర్, డెలివరీ బాయ్, వెయిటర్, వీళ్ళని ఏ మాత్రం అలోచించకుండా ఒక మాట అనేస్తాం. అదే లోయర్ మిడిల్ క్లాస్ వాడు తిరిగి దేబ్బెస్తే ఎలా వుంటుందో ఈసినిమా ద్వారా చూపించా… సినిమా ఉగాది రోజు విడుదలౌతుంది. ఉగాది పచ్చడిలానే వుంటుంది. థియేటర్ లో పచ్చడి పచ్చడి చేస్తా. ఫస్ట్ హాఫ్ అంతా డ్యాన్స్ లు ఫైట్లు ఎంటర్ టైన్ మెంట్ అన్నీ బావుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది.. అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఛాతిలో చిన్న బరువు స్టార్ అవుతుంది మెల్లగా చెమటలు వస్తాయి. ఇది ట్రైలర్ 2.0 మాత్రమే కాదు. ఇది విశ్వక్ సేన్ 2.0 అని చెప్పుకొచ్చారు. మరి చూద్దాం విశ్వక్ సేన్ చెప్పినంత సినిమాలో ఉంటుందో? లేదో?
కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.