ధమ్కీ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ స్పీచ్

Vishwak Sen Speech At Dhamki Movie Trailer Launch Event

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0 ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నిన్న కరీంనగర్‌లో జరిగిన గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌లో దాస్ కా ధమ్కీ 2.0 ట్రైలర్‌ను మంత్రి గంగుల కమలాకర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, దాస్ కా ధమ్కీ 2.0 ట్రైలర్ లాంచ్ కి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ గారికి.. ఎమెల్యే రసమయి బాలకిషన్ గారికి కృతజ్ఞతలనీ.. ధమ్కీ సినిమా ఉగాది రోజు విడుదలౌతుందనీ.. ఉగాది పచ్చడిలానే ఉంటుందనీ.. థియేటర్ లో పచ్చడి పచ్చడి చేస్తాననీ.. ఫస్ట్ హాఫ్ అంతా డ్యాన్స్ లు ఫైట్లు ఎంటర్ టైన్ మెంట్ అన్నీ బావుంటాయనీ.. 17న జరిగే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గారు వస్తున్నారనీ.. ఆస్కార్ ఈవెంట్ నుంచి నేరుగా మా ఈవెంట్ కి వస్తున్నారనీ.. తారక్ అన్న అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేశారనీ.. చాలా గర్వంగా ఉందనీ.. తాను పూర్తి నమ్మకంతో దమ్ముతో చెబుతున్నా..వస్తున్నా.. కొడుతున్నా.. అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =