కబ్జ అందరికీ నచ్చుతుంది

kannada actor upendra about kabzaa movie

ఆర్ చంద్రు దర్శకత్వంలో విలక్షణ నటుడు ఉపేంద్ర హీరోగా వస్తున్న సినిమా కబ్జ. 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లతో అర్థమవుతుంది. ఈసినిమా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇక తెలుగులో కూడా ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా ఇక్కడ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘కబ్జ’ నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలానే ఉంటుంది.. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.. ఈ సినిమాను ఇంత గ్రాండియర్ గా తీర్చిదిద్దడం కోసమే దర్శకుడు చంద్రు గారు టైమ్ తీసుకున్నారు. గతంలో నేను చేసిన సినిమాలను .. డైలాగులను కూడా మీరంతా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే మరో సినిమాతోను మీ ముందుకు వస్తాను అంటూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. ఇంకా శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =