ఉపేంద్ర కబ్జా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kabzaa Movie Trailer Release Date Fixed

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని మార్చి 4 వ తేదీన సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. ఇంకా శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =