తన పాత్ర కై ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టే సుధీర్ బాబు ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా మామా మశ్చీంద్ర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో మృణాళిని రవి ఈషా రెబ్బా కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు లుక్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
మామా మశ్చీంద్ర మూవీ లో సుధీర్ బాబు దుర్గ పాత్ర లుక్ ను మేకర్స్ మార్చి 1 వ తేదీ రిలీజ్ చేయగా, సిక్స్ ప్యాక్ తో ఫిట్ గా కనపడే సుధీర్ బాబు లడ్డు బాబు గా కనిపించడం తో ప్రేక్షకులు షాక్ అయ్యారు. మార్చి 4వ తేదీ పరశురామ్ పాత్ర లుక్ , మార్చి 7 వ తేదీ డీజే పాత్ర లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మామా మశ్చీంద్ర మూవీ లో సుధీర్ బాబు దుర్గ రోల్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేసిన సుధీర్ బాబు ఇక నెక్స్ట్ వచ్చే లుక్ కోసం సిద్ధంగా ఉండమనీ , దుర్గ కి ఇచ్చిన రెస్పాన్స్ కి చాలా థాంక్స్ అనీ , అలాగే నెక్స్ట్ వచ్చే పరశురామ్ గాడి స్వాగ్ కూడా అదిరిపోతుందనీ చెప్పారు. మార్చి 4 వ తేదీ రానున్న పరశురామ్ లుక్ లో సుధీర్ బాబు తాను ఎలా కనిపించి ఆశ్చర్యపరుస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/a6qd_TeFBgs/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/YZoPiFwzADI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/RDjH12NNrYg/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/hmb1uogndeM/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)