ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్

Allu Aravind sensational comments on Icon star Allu ArjunTelugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Aravind Latest news, Producer Allu Aravind, Allu Aravind,Allu Arjun upcoming Movie,Allu Arjun Latest Movie, Allu Arjun Movie Updates,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu ArjunAllu Aravind comments on Allu Arjun,Allu Aravind about Allu Arjun,

మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి ఓ సినిమా వస్తుందంటే, ఆ సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అంతలా ఈ బ్యానర్ నుండి వచ్చే సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంటుంది.తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్, తన కొడుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. గతంలో తనను చూసి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారనీ , కానీ, ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని గుర్తిస్తున్నారనీ , ఒక తండ్రికి ఇంతకన్నా ఏం గుర్తింపు కావాలనీ అల్లు అరవింద్ గర్వంగా చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =