యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మిర్చి మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనుష్క ,రిచా గంగోపాథ్యాయ కథానాయికలు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తొలిచిత్రం గా తెరకెక్కిన మిర్చి మూవీ తో కొరటాల టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఈ మూవీలో హీరో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రభాస్ , అనుష్క ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 6 నంది అవార్డ్స్ అందుకున్న మిర్చి మూవీ కన్నడ , బెంగాలీ , ఒడియా భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిర్చి మూవీ 28 సెంటర్స్ లో శత దినోత్సవం జరుపుకుంది. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మిర్చి మూవీ 80 కోట్లు గ్రాస్ , సుమారు 48 కోట్ల షేర్ సాధించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మూవీ లో పండగలా దిగివచ్చావు సాంగ్ ను గానం చేసిన గాయకుడూ కైలాష్ ఖేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. నిన్నటితో మిర్చి మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: