కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

1000 కోట్ల క్లబ్ దిశగా పఠాన్

Pathaan Movie Inches Closer To 1000 Crore Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie U

1000 కోట్ల క్లబ్ దిశగా పఠాన్

Pathaan movie inches closer to 1000 crore mark

Pathaan Movie Inches Closer To 1000 Crore Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie U

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25 వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన పఠాన్ మూవీ కి ఇండియా తో పాటు పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకూ పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 865 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.ఇప్పటి వరకూ దంగల్, బాహుబలి 2, RRR మరియు కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్