ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. వీరు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు డైరెక్టర్లుగా, నిర్మాతలుగా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా మారుతున్నాడు. ఆ కమెడియన్ ఎవరో కాదు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న పృథ్విరాజ్. ఇప్పుడు పృథ్విరాజ్ కూడా మెగాఫోన్ పట్టబోతున్నాడు. పృథ్వీ రాజ్ దర్వకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు ఆయన కూతురు శ్రీలు చేస్తుంది. ఈసినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతుంది. కూతురి సినిమాకు తండ్రి దర్శకత్వం వహించడం విశేషం.
కాగా ఈసినిమాలో క్రాంతి కృష్ణ హీరోగా నటిస్తుంది. ఇంకా విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. కాగా కమెడియన్ గా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. మరి దర్శకుడిగా ఎంతవరకూ సక్సెస్ ను సాధిస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: