సి.యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ బెదురులంక 2012 మూవీ తెరకెక్కుతుంది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ కాగా అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కుతున్న బెదురులంక 2012 మూవీ తాజాగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. దీంతో సెట్స్ లో భారీ కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా కార్తికేయ, నేహాశెట్టి చిత్ర యూనిట్ తో కలిసి సందడి చేశారు. చిత్రీకరణ అనుకున్నట్టుగా పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం వరల్డ్ అఫ్ బెదురులంక అని మేకర్స్ విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచగా త్వరలో ఆసక్తికరమైన టీజర్ ని కూడా విడుదల చేయనున్నారని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: