మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Celebrations get GRANDER 💥
MEGA POWER STAR @AlwaysRamCharan garu joins #WaltairVeerayya's వీరయ్య విజయ విహారం ❤️🔥😎
Tomorrow from 6 PM onwards 💥🔥
MEGASTAR @KChiruTweets MASS MAHARAJA @RaviTeja_offl @dirbobby @ThisIsDSP pic.twitter.com/oqeeEjJAoe
— Mythri Movie Makers (@MythriOfficial) January 27, 2023
పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా, అద్భుత సాంగ్స్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈమూవీ.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ 10 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరి, ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ మీట్ ను వీరయ్య విజయ విహారం పేరుతో జనవరి 28 వ తేదీ యూనివర్సిటీ ఆర్ట్స్ &సైన్స్ కాలేజ్, సుబేదారి, హన్మకొండ లో మేకర్స్ గ్రాండ్ గా జరపనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాయిన్ కానున్నారని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: