తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేడు ఉదయం అలనాటి అందాల తార జమున మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాల చేత నేడు తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో ఇప్పటికే ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగానే మరో చేదు ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రావటంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరొసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మూర్తి మరణంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు శ్రీనివాస మూర్తి సుపరిచితుడే. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో శ్రీనివాసమూర్తి తన సేవలను అందిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యి పైగా చిత్రాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. బాలీవుడ్ హీరోలైన షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ లకు సైతం శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: