కస్టడీ-కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Krithi Shetty Poster Out From Custody Movie, Krithi Shetty Poster Out, Krithi Shetty First Look, Naga Chaitanya, Krithi Shetty, Venkat Prabhu, Naga Chaitanya Movies, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Upcoming Movie, Custody, Custody 2023, Custody Movie, Custody Update, Custody Latest News, Custody Telugu Movie, Custody Movie Live Updates, Custody Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో  నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఒకేసారి చీత్రీకరణ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటించబోతున్నాడని ఇప్పటికే అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అలానే రీసెంట్ గా ఈసినిమాలో నటిస్తున్న రామ్ కీ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కృతి శెట్టి రేవతి అనే పాత్రలో నటిస్తుంది. ఇక కృతి శెట్టి లుక్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెగ్యులర్ గా కాకుండా కృతి నుంచి ఈ పోస్టర్ మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. మరి చూద్దాం సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో..

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి మరో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =