గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్నీ ఈసినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ అలానే వేదిక ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు వేదిక మార్చనున్నారు. దీనికి కారణం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. నగరం మధ్యలో ఎలాంటి ఈవెంట్ జరపడానికి వీల్లేదని అధికారులు, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతోనే కొత్త వేదికను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ ను ఈ ఈవెంట్ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ చిత్రయూనిట్ కూడా అధికారికంగా ప్రకటించారు.
Venue changed but the MASS fervor remains 🔥🔥#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards at Arjun Infra Ground, Ongole
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup @SonyMusicSouth pic.twitter.com/5C7n8EjP8Y
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: