మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో చిరు వేసిన స్టెప్స్ ను కూడా సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించినట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























