మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య మూవీ కి వర్క్ చేసిన అందరి గురించి చెప్పిన చిరంజీవి, రవితేజ ను మెన్షన్ చేయడం మర్చిపోయి తరువాత ఈ అంశంపై చాలా మదన పడ్డాను అనీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s my privilege & honour to share the screen with you annaya 🙏 Truly elated by your words ❤️ #WaltairVeerayya https://t.co/G2xuM77wRx
— Ravi Teja (@RaviTeja_offl) December 28, 2022
హీరో రవితేజ మెగాస్టార్ వ్యాఖ్యలపై ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. అన్నయ్య నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్పగా ఆనందంగా ఉందనీ , నీ మాటలతో ఇంకా ఆనందంగా ఉందనీ రవితేజ ఆనందం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశారు. చిరంజీవి , రవితేజ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ధమాకా మూవీ గ్రాండ్ సక్సెస్ తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు . చిరంజీవి , రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.