శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RC15 మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రి లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ , శ్రీకాంత్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. #RC15 మూవీ మరో షెడ్యూల్ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద, బురుజు పరిసర ప్రాంతాలలో రేపటి నుండి జరుగనుందని సమాచారం. హీరో రామ్ చరణ్ కర్నూలు కు వెళుతున్నారు. తమ అభిమాన హీరో రామ్ చరణ్ కు స్వాగతం చెప్పడానికి అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: