85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్

Prabhas Salaar Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Prabhas,Salaar News,Latest Telugu Movies,Upcoming Telugu Movie News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదుర్ సలార్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటికే 85 శాతం షూటింగ్ అయిపోయిందనీ , సలార్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ అధిగమిస్తుందనీ , ఎందుకంటే ఈ కథకు ఆ సత్తా ఉందనీ ,  జనవరి ముగిసే లోపు మిగిలిన షూటింగ్ పూర్తవుతుందనీ , వీఎఫ్ఎక్స్ కోసం కనీసం 6 నెలల సమయం పడుతుంది కాబట్టి సెప్టెంబరు 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనీ , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రషెస్ చూశాననీ , ఫుల్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటుందనీ నిర్మాత విజయ్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =