టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు కూడా ఒకరని అందరికీ తెలిసిందే. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు సినీ కెరీర్ మొదలవ్వగా ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక దిల్ రాజు నుండి సినిమా వస్తుందంటే ఆ సినిమా మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. వివాదాలకు కూడా దిలా రాజు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇండస్ట్రీలో ఇంకా టాప్ ప్రొడ్యూసర్స్ ఉన్నా కానీ దిల్ రాజుపై మాత్రమే వివాదాలు వస్తుంటాయి. ఏదైనా సినిమాకు థియేటర్లు కొరత ఉంటే చాలు దిల్ రాజు వైపే అందరూ వేు చూపిస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మళ్లీ థియేటర్ల విషయంపై దిల్ రాజు టార్గెట్ కు గురవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలే బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలో థియేటర్ల కొరత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి కూడా దిల్ రాజు కారణమని చూపుతున్నారు. వారిసు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని.. తెలుగు సినిమాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ వారిసు సినిమాకు థియేటర్లు కరువయ్యాయి. అక్కడ ఉదయ నిధి స్టాలిన్ స్క్రీన్లను కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు అక్కడికి వెళ్లి ఉదయనిధి స్టాలిన్ తో చర్చించినట్టు.. మరిన్ని స్క్రీన్లను అందించమని కోరానని తెలిపాడు. వ్యాపారంలో ఇవన్నీ కామనే అని వెల్లడించాడు.
ఇక విజయ్-అజిత్ వివాదం గురించి కూడా మాట్లాడుతూ అని నేను మొత్తం 40 నిమిషాల మేర ఇచ్చిన ఇంటర్వ్యూలో మిగతా ప్రశ్నలు మిస్ చేసి కేవలం వాటినే మాత్రమే హైలైట్ చేశారు.. నేను అందులో ఎక్కడా ఎవరినీ తగ్గించలేదు ఎవరినీ పొగడలేదని అది మొత్తం చూస్తే అర్ధం అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: