కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రైలర్ 1.0 అంటూ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే మొదటి పాటను నేడు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ జేట్ ఇచ్చిన నేపథ్యంలో నేడు పాటను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈపాటను రిలీజ్ చేశారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A dazzling Love song to heat up this winter season❤️
Here’s our #Dhamki First Single #AlmostPadipoyindePilla / #AlmostDilKaPathaMila
Tel- https://t.co/gh5Gbuz8cG
Hindi- https://t.co/5GgPJpIPV8@Nivetha_Tweets @leon_james @VanmayeCreation @VScinemas_ @saregamaglobal pic.twitter.com/vhlBBQ3qwf— VishwakSen (@VishwakSenActor) December 6, 2022
కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: