సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలో కూడా మహేష్ రాణిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో విజయవంతంగా దూసుకుపోతున్నారు. మరి అటు సినిమాల్లోనూ అలానే బిజినెస్ రంగంలోనూ ఆయన సక్సెస్ అవ్వడానికి ఆయన సతీమణి నమ్రత నుండి వచ్చే సపోర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నమ్రతా కూడా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏషియన్ సినిమాస్ వారితో కలిసి హైదరాబాదులో ఏఎంబి థియేటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏఎంబి థియేటర్ బెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా దూసుకుపోతోంది. ఇప్పుడు వారితోనే కలిసి నమ్రత రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో రెస్టారెంట్ కూడా ప్రారంభించనున్నారు. ఈ రెస్టారెంట్‌కు ఏఎన్ అనే పేరు పెట్టారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత. ప్రస్తుతం మినర్వా కాఫీ షాప్ , ప్యాలెస్ హైట్స్ గా రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ రెస్టారెంట్ ఈనెల 8న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: