ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం అంతర్జాతీయ అవార్డుల పంట పండుతుంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వడానికి దాదాపు నాలుగేళ్లు టైమ్ పట్టింది. ముఖ్యం కరోనా వల్ల వాయిదా పడుతూ.. పడుతూ.. ఫైనల్ గా ఈ ఏడాది రిలీజ్ అయి సంచలనాలు క్రియేట్ చేసింది. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. దీంతో ఈసినిమాకోసం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆతరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్ గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ అవార్డ్ ను దక్కించుకుంది. HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్ పొందింది. దీంతో పాటు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (AFCC)అవార్డ్స్ 2022లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరో గౌరవాన్ని పొందింది. బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరీలో అవార్డ్ సొంతం చేసుకుంది. ఇక దీనిపై చిత్రయూనిట్ కూడా స్పందిచి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
We RRR elated… 🤩
The cast and crew of #RRRMovie bags the prestigious HCA Spotlight Winner Award!
We’d like to thank the @HCAcritics jury for recognising #RRRMovie ! pic.twitter.com/0yCZIC2umv
— DVV Entertainment (@DVVMovies) December 6, 2022
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.