టాలీవుడ్ టాలెండెట్ హీరో అడివి శేష్ తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు. ఈఏడాది మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అడివి శేష్. ఇక ఇప్పుడు హిట్ 2 సినిమాతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా హిట్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాకు కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసినిమా అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చిత్రయూనిట్ కూడా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ హిట్ కు ఇంకా పలు సీక్వెల్స్ ఉన్నట్టు ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా అడివి శేష్ కు ట్వీట్ చేస్తూ.. హిట్ వర్స్ లోకి మహేష్ బాబు లాంటి స్టార్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలని.. అలా చేస్తే నెక్ట్స్ లెవల్ కు వెళుతుందని ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు నువ్వు తీసే థ్రిల్లింగ్ లాంటి స్టోరీస్ లో మహేష్ ను చూడాలని కోరిక.. సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ రాసి మహేష్ అన్నతో చేయండి అన్న అంటూ కోరాడు. ఇక దీనికి శేష్ రిప్లై ఇస్తూ.. మహేష్ సార్ కు అలాంటి కథ సూటవుతుందో లేదో నాకు తెలీదు.. ఆలోచించాలి.. అయితే మహేష్ సార్ నాకు కాల్ చేశారు.. చాలా సేపు మాట్లాడారు.. చాలా గర్వంగా ఉంది అన్నారు.. ఆ మాటకు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. నేను ఎప్పుడూ తనకు బ్రదర్ గా ఉంటాను అని మాత్రం ప్రామిస్ చేస్తున్నా.. హిట్ 2 తనకు చూపించడానికి వెయిట్ చేయలేకపోతున్నా అంటూ తెలిపాడు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏమైనా మహేష్ తో శేష్ ఇలాంటి సినిమా కథ రాసే ఆలోచన చేస్తాడేమో..
Don’t know. Suit avuthundho ledho Aalochinchaali. But Mahesh sir called me this morning and spoke for a long time about how PROUD he is of me. I got tears in my eyes. And l promised I will always be there as his brother. Can’t wait to show him #HIT2 #AskSesh https://t.co/9KWUUPs0S8
— Adivi Sesh (@AdiviSesh) December 3, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: