అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈసినిమా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సూపర్ హిట్ టాక్ ను సొంతంచేసుకుంది. ముథ్యంగా ఈసినిమా కథ, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్ గ్రిప్పింగ్గా ఉండటంతో సినిమా పాజిటివ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది మొదటిరోజు. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The BLOODY BLOCKBUSTER #HIT2 takes a MASSIVE start at the Box Office with 11.27 CR Gross Worldwide 🔥
Book your tickets now!
– https://t.co/afGvsb3c2N
– https://t.co/xZSrIiBgey#BloodyBlockbuster@AdiviSesh @NameisNani @KolanuSailesh @Meenakshiioffl @tprashantii @SVR4446 pic.twitter.com/XQyLtWXCF4— Wall Poster Cinema (@walpostercinema) December 3, 2022
కాగా ఈసినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఇంకా ఈసినిమాలో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: