మొత్తానికి ఎన్నోరోజుల సస్పెన్స్ కు నేటితో తెర పడింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో బుచ్చిబాబు రెండో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. అంతేకాదు తన రెండో సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. చాలా రోజులు ఆ వార్తలు నడిచాయి. అయితే ఆ తరువాత ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా కన్ఫామ్ అవ్వడం జరిగిపోయింది. మరి కొద్ది రోజుల్లో ఆ సినమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఆ తరువాత మళ్లీ బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడన్న వార్తలు తెరపైకి వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే ఈమధ్య బుచ్చిబాబు కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈవార్తలను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. బుచ్చిబాబు సానతో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమా ను బుచ్చిబాబు స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































