18 పేజెస్-నిఖిల్ కోసం శింబు పాట

Simbu Sings A Song For Nikhils 18 Pages Movie, Nikhils 18 Pages Movie, Simbu Sings A Song, Silambarasan TR, Nikhil Siddharth, Anupama Parameswaran, Palnati Surya Pratap, Nikhil Latest Movie, Nikhil's Upcoming Movie, 18 Pages, 18 Pages 2023, 18 Pages Movie, 18 Pages Telugu Movie, 18 Pages Movie Update, 18 Pages New Update, 18 Pages Movie Latest News And Updates, 18 Pages Movie Live Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు నిఖిల్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 18 పేజెస్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్ దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. టైమ్ ఇవ్వు పిల్లా అనే పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈపాటను శింబు పాడనున్నట్టు కూడా చిత్ర బృందం పేర్కొంది. ఇక శింబు ఇంతకుముందే తెలుగులో పలు పాటలు పాడిన సంగతి తెలిసిందే కదా. ఇంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో, రామ్ పోతినేని ‘ది వారియర్’ లో బులెట్ సాంగ్ ను శింబు పాడారు. ఇంకాపుల హీరోలకు కొన్ని పాటలు పాడారు. అంతేకాదు ఆయన పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ పాటపై అంచనాలు ఏర్పడ్డాయి. చూద్దాం మరి ఈపాట ఎలా ఉండబోతుందో..

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =