శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకీ సీక్వెలే ఈసినిమా. అడివి శేష్ హీరోగా చేస్తోండటంతో సినిమా మీద అంచనాలు ఆల్రెడీ పెరిగాయి. త్వరలో ఈసినిమా రిలీజ్ కాబోతుండగా ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టు ఎవరన్నది ఊహించండి అంటూ సస్పెన్స్ లో పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Grand Pre-Release event of #HIT2 on 28th Nov at JRC Convention 💥
Get ready for an exhilarating evening & keep guessing the Chief Guests 😉#HIT2onDec2@AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/VqatK6x0H0
— Wall Poster Cinema (@walpostercinema) November 24, 2022
కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.