మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఏ ఎస్ ప్రకాష్ వాల్తేరు వీరయ్య మూవీకి వర్క్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాల్తేరు వీరయ్య మూవీ లో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పై తెరకెక్కిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ప్రోమోతో సాంగ్ పై అంచనాలు పెరిగాయి. బాస్ పార్టీ సాంగ్ కు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ వేసిన సెట్ అద్భుతంగా వచ్చిందనీ, దర్శకుడు బాబీ ఆలోచనకి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ చేశాడు.. తన అనుభవాన్ని రంగరించి ఈ చిత్రానికి, మరింత ప్రత్యేకించి ఈ పాటకి తాను చేసిన ఆర్ట్ (సెట్) వర్క్ మమ్మల్నందరిని ఆకట్టుకుంది. మీ ప్రశంసలు కూడా అతనికి దక్కుతాయని ఆశిస్తూ.. గెట్ రెడీ.. ద పార్టీ బిగెన్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఒక ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను కొనియాడిన చిరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: