మాస్ మహారాజా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి ఇంకా రామారావు ఆన్ డ్యూటీ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాాజాగా ఈసినిమా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట. నాగేశ్వరరావు జీవితం ఎలా మలుపు తిరిగింది ?, అనే కోణంలో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. చూద్దాం మరి ఈసినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ కెరీర్ లో ఆయన నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ అలానే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: