హీరో వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. . అందులో ఒకటి జాతీయ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు సినిమా కాగా, మరో ప్రాజెక్ట్ కోసం కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెలుగు, హిందీ భాషలలో VT 13 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పూజాకార్యక్రమం జరుపుకున్న ఈ మూవీ లో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది . వరుణ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది. పవర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ నటిస్తున్నారు . ఈ సినిమాలో.ఎయిర్ ఫోర్స్ అధికారి వర్ధమాన్ అభినందన్ పాత్రకు సంబంధించిన రియాల్టీ అంశాలు ఎంతో సాహసోపేతంగా చూపించ బోతున్నారనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: