హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 370 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ సూపర్ డూపర్ హిట్ కావటమే కాదు., కాసుల వర్షం కురిపిస్తుంది .కాంతారా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ ఇప్పుడు సరికొత్త చరిత్రను తిరగ రాసింది. బాలీవుడ్ లో కాశ్మీర్ ఫైల్స్ తర్వాత చరిత్రను పునరావృతం చేస్తూ 1000శాతం రిటర్న్ లను సాధించే మూవీగా రికార్డులకెక్కుతోంది. కాంతార (హిందీ) ఇప్పటివరకు 76 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ కేవలం 7.50 కోట్లు. కాబట్టి రిటర్న్స్ ప్రకారం రాబడులు 913.33 శాతం వద్ద ఉన్నాయి. ఈ చిత్రం అతి త్వరలో 1000 శాతం రిటర్నులతో సెన్సేషన్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇదే జరిగితే `ది కాశ్మీర్ ఫైల్స్` తర్వాత 1000శాతం లాభాలను ఆర్జించిన ఏకైక హిందీ డబ్బింగ్ చిత్రంగా కాంతార మూవీ చరిత్ర సృష్టిస్తుంది. కె జి ఎఫ్ 2 థియేట్రికల్ రన్ లో 1162 శాతం రాబడిని సాధించింది.ఈ చిత్రం 1000 శాతం లాభాలతో దూసుకుపోతున్నందున డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు -పెట్టుబడిదారులు జాక్ పాట్ కొట్టారని హిందీ సర్కిల్స్ లో ముచ్చట సాగుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: