నాగశౌర్యకు అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు

Hero Naga Shaurya Gets Hospitalized, Naga Shaurya Gets Hospitalized, Hero Naga Shaurya, Actor Naga Shaurya, Naga Shaurya, Naga Shaurya's 24th film, Naga Shaurya Latest Movie, Naga Shaurya's Upcoming Movie, SS Arunachalam, NS24, Naga Shaurya Health Latest News, Naga Shaurya Health Live Updates, Naga Shaurya Health New Update, Naga Shaurya Health Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నా.. పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటున్నారు వైద్యులు. ఇక ఈ వార్త నుండి ఇంకా తేరుకోకముందే మరో యంగ్ హీరో అస్వస్థతలకు గురయ్యారు. తాజాగా షూటింగ్ లో పాల్గొన్న నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. దీని కారణం నాగశౌర్య తన సినిమాలోకి పాత్ర కోసం గత 3 రోజులుగా డైట్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. రేపు డిశ్చార్జి చేస్తారని వైద్యులు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇక సినిమాలో నటించే నటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =