బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NTR30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రారంభ షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నవిషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న#NTR30 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కొత్త మేకోవర్ ఉన్న తన ఫొటో ను న్యూ డే.. న్యూ వైబ్ అంటూ ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. డెనిమ్ షర్ట్ మరియు బ్లాక్ గ్లాసెస్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రిపేర్ అయినటువంటి ఈ కొత్త లుక్ ఒక యాడ్ కోసమా , #NTR30 మూవీ కోసమా అనేది క్లారిటీ లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: