స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. హరీ, హరీష్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసి లో జరిగ్ క్రైమ్ ల ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. నిజానికి ఈసినిమాకు ప్రమోషన్స్ కాస్త తక్కువగానే జరిగాయని చెప్పొచ్చు. ఈసినిమాకు రిలీజ్ ముందు వరకూ కూడా ఈసినిమా పూర్తి చేసుకునే పనిలోనే ఉంది. ముఖ్యంగా సమంతకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తను కూడా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దీంతో ఈసినిమాపై రిజల్ట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. హరీ హరీష్ కొత్త పాయింట్ తో సినిమాను తెరకెక్కించడం.. సమంత నటన, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారడంతో సినిమాకు మంటి టాక్ వస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. యూఎస్ లో ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 60 వేల డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. దీనితో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈసినిమాకు దక్కాయని తెలుస్తుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: