ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్

Itlu Maredumilli Prajaneekam Trailer is out now, Itlu Maredumilli Prajaneekam Trailer out, Allari Naresh Is Set To Deliver Another Solid Content, Itlu Maredumilli Prajaneekam Trailer Released, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Prajaneekam Movie Trailer, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie, Allari Naresh's Upcoming Movie, Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Prajaneekam 2022, Itlu Maredumilli Prajaneekam Movie, Itlu Maredumilli Prajaneekam Update, Itlu Maredumilli Prajaneekam New Update, Itlu Maredumilli Prajaneekam Latest Update, Itlu Maredumilli Prajaneekam Movie Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Latest News, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Live Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie New Update, Itlu Maredumilli Prajaneekam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌‌ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ”ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి” అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైయింది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా వుంది. ”సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకొని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి”. ”కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు”. ”అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు”.. ట్రైలర్ తొలి సగంలో వినిపించిన ఈ డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా వున్నాయి.

”పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు” అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగా వున్నాయి. నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగా వున్నాయి. ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. ఇంటెన్స్ రోల్ లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్ లో కీలకంగా కనిపించారు.

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =