
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం…