తెలుగు స్టార్ కమెడియన్ సునీల్ కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్‌తో ఓ సినిమా లో నటించనున్నారు. తెలుగులో అగ్ర హాస్యనటులలో ఒకరిగా సునీల్ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ఎన్నో సినిమాలు సక్సెస్ కావడానికి సునీల్ కీలకంగా నిలిచారు. హాస్యనటుడిగా బిజీగా ఉన్న తరుణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడుతో పాటు పలు సినిమాలతో విజయాల్ని అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాంతి టాకీస్ బ్యానర్ పై మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ , ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ ఎస్ తనయ అదితి శంకర్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ మావీరన్ తమిళ మూవీ, తెలుగు వెర్షన్ మహా వీరుడు మూవీతెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. మావీరన్ మూవీ తో సునీల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: