సమంత యశోద రివ్యూ

samantha yashoda movie telugu review, Yashoda Telugu Movie Review, Yashoda Movie Review, Yashoda Review, Yashoda Telugu Review, Yashoda Movie - Telugu, Yashoda First Review, Yashoda Movie Review And Rating, Yashoda Critics Review, Yashoda (2022) - Movie, Yashoda (2022), Yashoda (film), Yashoda Movie (2022), Yashoda Movie: Review, Yashoda Story review, Yashoda Movie Highlights, Yashoda Movie Plus Points, Yashoda Movie Public Talk, Yashoda Movie Public Response, Yashoda,Yashoda Movie, Yashoda Movie Updates, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie Latest News, Samantha, Hari, Harish, Varalaxmi Sarathkumar, Mani sharma, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Sivalenka Krishna Prasad, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

స్టార్ హీరోయిన్ గా తెలుగులో కొన్నేళ్లుగా రాణిస్తున్న సమంత ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు తన నుండి వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హరీ, హరీష్ దర్శకత్వంలో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇక నేడు ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. సమంతకు హిట్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం.. హరీ, హరీష్
బ్యానర్స్.. శ్రీదేవి మూవీస్‌
నిర్మాతలు.. శివలెంక కృష్ణప్రసాద్
సినిమాటోగ్రఫి.. ఎం సుకుమార్
సంగీతం.. మణిశర్మ

కథ

య‌శోద (స‌మంత‌) త‌న చెల్లెల‌ను కాపాడుకోవ‌టానికి స‌రోగ‌సీ ద్వారా అమ్మ‌గా ఉండ‌టానికి ఒప్పుకుంటుంది. దీని ద్వారా వచ్చే డబ్బుతో చెల్లిని కాపాడుకోవాలని చూస్తుంది. డబ్బున్న కుటుంబానికి బిడ్డను అందిస్తుండటంతో ఈనేపథ్యంలోనే సమంతను ఆరోగ్యంగా ఉంచేందుకు ఫెర్టిలిటీ సెంటర్ ఈవా కు తరలిస్తారు. అయితే అక్కడ తనలాగే చాలామంది ఉంటారు. అక్కడ వారిని చూసేందుకు మధు (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) ఉంటారు. అక్క‌డున్న అమ్మాయిలు పిల్ల‌ల్ని క‌న‌టానికి నొప్పుల‌తో బ‌య‌ట‌కు వెళ‌తారు. కానీ మ‌ళ్లీ క‌న‌ప‌డ‌రు. అవ‌న్నీ య‌శోద‌కు అనుమానాన్ని రేకెత్తిస్తాయి. మరోవైపు హాలీవుడ్ నటి ఒలివియా, టాప్ మోడల్‌ ఆరూషి మరణిస్తారు. వారి మరణం వెనుకున్న రహస్యాలను చేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. మరి ధ‌నికులైన అమ్మాయిలు, హాలీవుడ్ తార‌లు ఇండియాకు ఎందుకు వ‌చ్చి వెళుతుంటారు? వారి వెనుకున్న క్రైమ్‌కి, స‌రోగ‌సీ సెంట‌ర్‌కి ఉన్న లింకేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

హరి అండ్ హరీష్‌ ఎంచుకున్న పాయింట్, తీసుకున్న నేపథ్యం అన్నీ కొత్తగానే ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసీ వెనుక జరిగే క్రైమ్ పాయింట్‌తో ఈసినిమాను తెరకెక్కించారు హరీ హరీష్. సరోగసి గురించి ఇప్పుడు చాలామందికి అనుభవం ఉంది. తల్లికాలేని ఎంతోమంది ఈ పద్దతి ద్వారా తల్లి అవుతున్నారు. అయితే నాణోనికి రెండు కోణాలు ఉన్నట్టు.. ఈ పద్దతిలో కూడా జరిగే క్రైమ్ లను ప్రధాన అంశంగా తీసుకున్నారు. అంతేకాదు బ్యూటీ ప్రొడక్ట్స్, అందం మీద జరిగే వ్యాపారం ఎలా ఉంటుందో చూపించారు. ఈసినిమాలో కథ కొత్తగా ఉండటం.. ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఉండటంతోనే ఈసినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది.

పెర్ఫామెన్స్

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సమంత ప్రధాన పాత్రలో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఈసినిమాలో కూడా సమంత సినిమాను తన భుజాలపై మోసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు ప్రధాన బలం తానే. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేసింది. సమంతతో పాటు కీలక పాత్రల్లో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంతకు ముందే విలన్ పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈసినిమాలో కూడా మరోసారి తనదైన శైలిలో గ్రే షెడ్ లో నటించి మెప్పించింది. ఉన్ని ముకుందన్ పాత్ర కూడా హైలెట్ గా నిలుస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు, మిలటరీ ఆఫీసర్‌గా సంపత్ చక్కగా నటించారు. మినిస్టర్‌ పాత్రలో రావు రమేష్ తన స్టైల్లో నటించేశాడు. మిగిలిన పాత్రల్లో ఎవరి పరిధిమేర వారు నటించారు.

టెక్నికల్ వాల్యూస్

సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు ప్రధాన బలం సంగీతం కూడా అని చెప్పొచ్చు. పాటలు సంగతి పక్కపెడితే మణిశర్మ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు మరో ప్లస్ పాయింది. ఇంకా సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కొత్త కథలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ గా యశోద థ్రిల్లింగ్ సినిమా అని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =