నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్‌కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.కర్ణాటక రత్నపురస్కారాన్ని పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని గారికి సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఎన్టీఆర్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం గర్వించదగ్గ గొప్పనటులు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అనీ , అలానే ఆయన కుటుంబం నుండి వచ్చిన శివన్న, దివంగత పునీత్ రాజ్ కుమార్ ఇద్దరూ కూడా నటులుగా ఎంతో గొప్ప పేరు అందుకుని రాజ్ కుమార్ గారి పేరుని మరింతగా పెంచారనీ , అప్పు స్నేహితుడిగా తాను ఇక్కడికి వచ్చాననీ , ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రభుత్వ పెద్దలకు చాలా ధన్యవాదాలనీ , అప్పు కుటుంబం తనను తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారనీ , అప్పు ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. ఒక మంచి భర్త, కొడుకు, తండ్రి.. మంచి స్నేహితుడు.. అన్నింటికీ మించి మానవత్వం కలిగిన మంచి మనిషి అనీ , కర్నాటకరత్న అవార్డ్ పునిత్ కు ఇవ్వడంతో ఆ అవార్డ్ కు నిజమైన గౌరవం వచ్చిందనీ చెప్పారు. ఎన్టీఆర్ తన స్పీచ్ మొత్తం కూడా కన్నడ భాషలో మాట్లాడడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































