కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

Hansika Gets Engaged To A Businessesman, Hansika gets engaged to Sohael Khaturiya, Hansika Motwani Engaged, Businessesman Sohael Khaturiya, Mumbai Based businessman Sohael Khaturiya, Hansika to get married soon, Hansika marriage, Actress Hansika Motwani, Hansika Engagement News, Hansika Engagement Latest News And Updates, Hansika Engagement Live Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లిళ్లు కాస్త ఆలస్యంగా చేసుకునే వారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకసారి పెళ్లి అయిపోయిందంటే తమ కెరీర్ కు బ్రేక్ పడినట్టే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీల్లో వస్తున్న మార్పులు వల్ల అలాంటి పరిస్థితులు కాస్త తగ్గాయి. ఇక ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ గా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది హన్సిక. తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ను వివాహమాడబోతున్నట్లు తెలిపారు. పారిస్‌ లోని ఈఫిల్‌ టవర్‌ ముందు తనకు ప్రపోజ్ చేసిన ఫొటోలను షేర్‌ చేసింది హన్సిక. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =