చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లను బట్టి ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈసినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈసినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్, నరేష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, సునీల్, రఘుబాబు, సత్యం రాజేష్, సురేష్, భద్రం తదితరులు
దర్శకత్వం.. ఈషాన్ సూర్య
బ్యానర్స్.. అవ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు.. మోహన్ బాబు మంచు
సినిమాటోగ్రఫి.. చో టా.కె.నాయుడు
సంగీతం..అనూప్ రూబెన్స్
కథ
గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నాకు (మంచు విష్ణు) స్కూల్ టైమ్‌లో రేణుక (సన్ని లియోన్), స్వాతి (పాయల్ రాజ్ పుత్ )లతో మంచి స్నేహం ఉంటుంది. వీరిలో రేణుక మాత్రం చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోతుంది. ఇక పెద్దయ్యాక వీరిలో జిన్నా (మంచు విష్ణు) ఊర్లో అప్పు చేసి టెంట్ హౌస్ పెడతాడు. అతను టెంట్ హౌస్ వేస్తే.. పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. దీంతో అప్పుల భారం మాత్రం పెరిగిపోతుంటది. మరోవైపు స్వాతి కూడా అదే ఊర్లో ఉంటుంది.జిన్నా, స్వాతి ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇదిలాఉండగా జిన్నా తన అప్పులు తీర్చడం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తాడు. ఈలోగా రేణుక అమెరికా నుండి వస్తుంది, ఆస్తి, డబ్బు ఉందన్న కారణం గా సన్నీ తో క్లోజ్ గా ఉంటాడు జిన్నా. అయితే తన ప్లాన్ లో భాగం గా సన్నీ కి దగ్గరైన జిన్నా, అమెరికా నుండి వచ్చింది రేణుక కాదు, రూబీ అని తెలుసుకుంటాడు. అసలు రూబీ, రేణుక గా ఎందుకు వచ్చింది. జిన్నా తన అప్పులు తీర్చాడా? స్వాతి నీ పెళ్లి చేసుకున్నాడా? రూబీ ను చివరకు జిన్నా ఏం చేశాడు లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
మోసగాళ్లు సినిమా తరువాత మంచు విష్ణు నుండి వస్తున్న సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా విష్ణు డీసెంట్ హిట్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. కామెడీ ఎంటర్ టైన్ లు చేయడం విష్ణుకు కొత్తేమీ కాదు. తను నటించిన ఢీ సినిమా చాలు తనలో కామెడీ యాంగిల్ గురించి చెప్పాలంటే. ఇక ఈసినిమాలో జిన్నా పాత్రలో మంచు విష్ణు ఎంతో ఈజీగా నటించేశాడు. యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్‌పుత్ తన అందంతో ఆకట్టుకుంది. సన్నీలియోన్ విషయానికి వస్తే తన గ్లామర్‌తో మరోసారి వావ్ అనిపించింది. చెప్పాలంటే తనదే సినిమాలో హైలెట్ పాత్ర. వీరితో పాటు సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర చమ్మక్ చంద్రది. రాకేష్ మాస్టర్ పాత్రలో చమ్మక్ చంద్ర చెలరేగిపోయాడు. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలో సప్తగిరి పాత్రను తలపించేలా ఉండే రాకేష్ మాస్టర్ పాత్రను చమ్మక్ చంద్ర తనదైన శైలిలో పండించారు. ఇక సునీల్ పెళ్లికొడుకు పాత్రలో, అన్నపూర్ణ, రఘుబాబు, నరేష్, సురేష్, వెన్నెల కిషోర్, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
నిజానికి ఈసినిమా కథ అందరూ ఊహించుకుందే అని చెప్పొచ్చు. కానీ కథ పాతది అయినా కూడా కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సూర్య. డైరెక్టర్ కామెడీ తో పాటు హార్రర్ యాంగిల్ ను కూడా తీసుకోవడం ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. చిత్తూరు యాసలో పక్కా పల్లటూరి మాటలను రాసుకున్నారు. ఈ మాటలే ప్రేక్షకులను నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త సరదాగా, కామెడీతో సాగిపోయినా.. సెకండ్ హాఫ్ నుండి కాస్త హార్రర్ యాంగిల్ కూడా తోడవడంతో సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది.
ఇక సాంకేతికంగా విభాగానికి వస్తే అన్ని ఎలిమెంట్స్ లో జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే.జిన్నా స్థాయికి తగ్గట్టుగా సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన జిన్నా ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: