సలార్ పై పృథ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

prithviraj interesting comments on salaar movie, interesting comments on salaar movie, prithviraj Sensational comments On salaar movie, Prabhas, Jagapathi Babu, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Salaar, Salaar Telugu movie, Salaar New Update, Salaar Telugu Movie New Update, Salaar Movie, Salaar Latest Update, Salaar Movie Updates, Salaar Telugu Movie Live Updates, Salaar Telugu Movie Latest News, Salaar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. అయితే తాజాగా మరో అప్ డేట్ కూడా ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో పృథ్విరాజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరదరాజా మన్నార్ పాత్రలో కనిపించబోతోన్నా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశాడు పృథ్విరాజ్. చాలా కాలం తరువాత ప్రభాస్ ఈసినిమాతో మళ్లీ మాస్ కమర్షియల్ జోనర్ లోకి వస్తున్నాడని.. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు మాస్ యాక్షన్ జానర్‌కు కాస్త దూరంగా ఉన్నాయని.. కానీ సలార్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం అని తెలిపాడు. చూద్దాం మరి ప్రభాస్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో.

మరి బాహుబలి సినిమా తరువాత వచ్చిన సాహో సినిమా యాక్షన్ సినిమానే కానీ అది మాస్ మూవీ కాదు.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ అని చెప్పొచ్చు. ఇక ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ. ప్రస్తుతం వస్తున్న ఆదిపురుష్ సినిమా బ్యాక్ డ్రాప్ వేరు. ఈనేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ నుండి ఒక మంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోరుకుంటున్నారు. సలార్ తో వారి కోరిక తీరేలా కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రభాస్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 10 =