ఒక సినిమా హిట్ అయిందంటే చాలు ఇప్పుడు దానికి సీక్వెల్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ ఏడాది బంగార్రాజు, కార్తికేయ2 తో పాటు పలు సీక్వెల్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. ఆ సినిమా మరేదో కాదు గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చినా కూడా చాలా మంది ఎప్పుడో ఆ సినిమా చూసేసినా కూడా మళ్లీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. మోహన్ రాజా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీశారు. అదే ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయి అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అయితే మోహన్ రాజా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ రాజా ఈసినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. లూసిఫర్’ సినిమాను రీమేక్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు.. అందులోనూ మెగాస్టార్ తో చేస్తున్నాం.. అందుకే చాలా బాధ్యతతో ఈసినిమాను తెరకెక్కించాం. చిరంజీవి గారు మాస్ యాక్షన్ తో కూడిన పాత్రలను చేయడంలో మాస్టర్. ఆ తరహా సినిమాలను ఆయనతో చేయాలని ఉంది. అందుకు సంబంధించిన కొన్ని ఐడియాస్ నా దగ్గరున్నాయి. అలాగే ‘గాడ్ ఫాదర్’ తో మన టీమ్ పై మేకర్స్ కి ఒక నమ్మకం కుదిరింది కనుక, ‘గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం త్వరలోనే లభిస్తుందని భావిస్తున్నాను అని తెలిపారు. మరి చూద్దాం ఈ సీక్వెల్ ను టైమ్ ఎప్పుడు వస్తుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























