గాడ్ ఫాదర్ మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది

Megastar Chiranjeevi interview about Godfather movie, Chiranjeevi interview about Godfather movie, Megastar Chiranjeevi interview, Chiranjeevi, Salman Khan, Nayanthara, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather, Godfather Telugu movie, Godfather New Update, Godfather Telugu Movie New Update, Godfather Movie, Godfather Latest Update, Godfather Movie Updates, Godfather Telugu Movie Live Updates, Godfather Telugu Movie Latest News, Godfather Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ”గాడ్ ఫాదర్” గ్రాండ్ సక్సెస్ ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీ జీవితంలో చాలా విజయాలని , బ్లాక్ బస్టర్స్ ని చూశారు.. గాడ్ ఫాదర్ విజయం ఎంత ప్రత్యేకమైనది?

సినిమాని సమిష్టి కృషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి వుంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్ లో వచ్చిన గత చిత్రం నిరాశ పరిచింద. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. దానిని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాఫ్ కి క్రుంగిపోయేలా చేయలేదు. గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాదీ అని అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. లూసిఫర్ ని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన వుండేది. చరణ్ బాబు ఒక రోజు లూసిఫర్ ప్రస్తావన తీసుకొచ్చారు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే లూసిఫర్ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పారట. చరణ్ బాబు ఇలా చెప్పిన తర్వాత మరోసారి లూసిఫర్ చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులో వుండలేదు (నవ్వుతూ). తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. తని వరువన్ ని అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ రీమేక్ మోహన్ రాజా న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. మోహన్ రాజా కి కూడా ఇది ఇష్టమైన సబ్జెక్ట్. చేస్తానని చాలా ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యనంద్ తో కూర్చుని టీం అంతా చాలా చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ని అద్భుతంగా మలిచారు.

గాడ్ ఫాదర్ చూసి ఇండస్ట్రీ నుండి మీ మిత్రులు ఎలా స్పందించారు ?
నాగార్జున, వెంకటేష్.. ఇలా దాదాపు అందరూ కాల్ చేసిన మాట్లాడారు. దాదాపు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలుపుతూ అనందం వ్యక్తం చేశారు.

సాంగ్స్ , డ్యాన్స్ లు లేవు కదా అభిమానుల నుండి ఎలాంటి స్పందన వుంది ?
పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్ లు చేస్తే బావుటుందనే మాటే తప్ప సాంగ్స్ , డ్యాన్స్ లు లేవని ఎక్కడానెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినపుడు పాటలు లేవనే భావం కలగలేదు. దీనికి కారణం తమన్. నేపధ్య సంగీతంతో ప్రాణం పోశారు. యాక్షన్ సీన్స్ కి ఇంత హై రావడానికి కారణం తమన్ మ్యూజిక్. ఈ సినిమాని గాడ్ ఫాదర్ అనే టైటిల్ సూచించింది కూడా తమనే.

లూసిఫర్ తో పోల్చుకుంటే గాడ్ ఫాదర్ లో చాలా మార్పులు చేశారు ? ఇలా మార్పులు చేసినప్పుడు ఒరిజినల్ దెబ్బ తింటుందనే భయం కలగలేదా ?

ఎలాంటి మార్పులు చేస్తే ఫ్రెష్ గా ఆసక్తికరంగా వుంటుందనే ఆలోచనతో పని చేశాం. ఇది పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా వుంటుందో లేదో తెలీదు. అయితే దిని వెనుక బలమైన ఎమోషన్ వుంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ప్రధానంగా ఉంటూ మరో లేయర్ లో పొలిటికల్ డ్రామా వుండాలని మొదటరోజే అనుకున్నాం. మలయాళంలో సొంత కొడుకా కాదా అనే అనుమానం వుంటుంది. కానీ గాడ్ ఫాదర్ లో సొంత కొడుకని చాలా క్లియర్ గా చెప్పాం. అలాగే బ్రదర్ ని సిస్టర్ ఎందుకు ద్వేషిస్తుందో కూడా వివరంగా చూపించాం. అలాగే తన సిస్టర్ ని బ్రహ్మ పార్టీ ప్రెసిడెంట్ చేయడం కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశం అయ్యింది. ఈ మార్పులన్నీ మోహన్ రాజా అద్భుతంగా చేసి ప్రేక్షకులని కట్టిపడేశారు. మనం అనుభవంతో ఏదైనా మార్పు చెబితే మోహన్ రాజా దాన్ని చాలా గొప్ప గా స్వాగతించి దాని గురించి ఆలోచిస్తాడు. ఇది అతనిలో చాలా మంచి లక్షణం. రీమేక్ సినిమా చేయడం ఒక సవాల్. చాలా పోలికలు వస్తాయి. అయితే ప్రేక్షకుల ఆదరణ వలన ఒరిజినల్ ని మర్చిపోయేలా చేయగలుగుతున్నాం. ఘరానామొగుడు, ఠాగూర్ .. చిత్రాలు గొప్ప విజయాలు అందుకొన్నాయి. రిమేక్ కథలలో నా పాత్ర, ప్రజంటేషన్ సరికొత్తగా వుంటుంది. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వుంటుంది. (నవ్వుతూ) గాడ్ ఫాదర్ లో కూడా అది అద్భుతంగా కుదిరింది.

సత్యదేవ్ , పూరి జగన్నాథ్ , సర్వదమన్ బెనర్జీ పాత్రలు మీ ఎంపికేనా ?
సర్వదమన్ బెనర్జీ ఇందులో సిఎం పాత్ర ఆయన అయితే బావుటుందని అనుకున్నాం. అయితే తను చాలా కాలంగా నటనకు దూరంగా వున్నారు. మా కోరిక మేరకు నటించడానికి ఒప్పుకున్నారు. ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. పూరి జగన్నాథ్ కూడా అంతే. ఇందులో యూట్యూబర్ పాత్రలో నటించమని అడిగితే మొదట టెన్షన్ పడ్డారు. తర్వాత ఒప్పుకున్నారు. జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ అతని కోరిక మీద నుండి వచ్చిందని అనుకోవచ్చు. సత్యదేవ్ చాలా ప్రతిభ వున్న నటుడు. ఈ పాత్ర చేయమని నేనే తనకి కథ చెప్పా. తను షాక్ అయ్యాడు. ”మీరు చేయమని అడిగితే చేసేస్తాను అన్నయ్య నాకు ఎందుకు కథ చెబుతున్నారు.. నాకు అంతా బ్లాంక్ గా వుంది” అన్నాడు. వావ్ అనేలా తన పాత్ర చేశాడు. తన ప్రజంటేషన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. నయనతార ఈ కథకు మరో ఆకర్షణగా నిలిచారు. చాలా అద్భుతంగా చేసింది. ఇందులో నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించారు. మోహన్ రాజా సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని అన్నారు. చరణ్ బాబు సల్మాన్ తో మాట్లాడారు. సల్మాన్ మాపై ఎంతో ప్రేమతో మరో ఆలోచన లేకుండా ” చిరు గారు కోరితే నేను నటించడానికి రెడీ” అని చెప్పారు.

మార్పులు విషయానికి వస్తే ఠాగూర్ లో పాటలు డ్యాన్సులు పెట్టారు .. కానీ లూసిఫర్ లో ఆ హంగులు లేకుండా తీశారు కదా?
ప్రేక్షకుల అభిరుచి కాలనికి తగ్గుట్టు మారుతోంది. బలమైన కథనం వుంటే పాటలు, ఫైట్లు లేకపోయిన దానికి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే గాడ్ ఫాదర్ ని రూపొందించాం. ప్రేక్షకులు దీనిని గొప్పగా ఆదరిస్తున్నారు. మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు రావడానికి ఇది మంచి సంకేతంగా భావిస్తున్నాను. భవిష్యత్ లో కూడా వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలని ప్రయత్నిస్తాను.

సైరా మీ డ్రీమ్ కదా .. అలాంటి పాత్రలు ఇంకెమైనా చేయాలనీ ఉందా ?
మైత్రీ మూవీ మేకర్స్ , బాబీ దర్శకత్వంలో రాబోతున్న 154లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే చిత్రంగా ఆకట్టుకుంటుంది. అలాగే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం వుంటుంది.

ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వున్నారు .. వరుసగా సినిమాలు చేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దగా వున్నారు.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు ?
ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్ను ఎంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ,అభిమానంతోనే ఈ స్థాయిలో వున్నాను. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే వుంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను. కృతజ్ఞత తీర్చుకునే విధానంలో ఈ భాద్యతలు నిర్వహిస్తున్నాను.

యువ దర్శకులతో పని చేయడం ఎలా వుంది ?
ఇప్పుడున్న యువ దర్శకులకు అన్ లిమిటెడ్ సమాచారం వుంది. కొత్త విషయాలని చాలా చక్కగా అపరిమితంగా నేర్చుకుంటున్నారు. వారికీ కోరుకున్నది ప్రజంట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు వున్నాయి. నా ఇమేజ్, వారు కొత్త గా చూపించే విధానం ఈ కాంబినేషన్ బావుటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను.

మీరు పవన్ కళ్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా ?
మా తమ్ముడి తో చేయాలనే సరదా నాకు వుంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ వుంటుంది. అన్నీ కుదిరిన రోజున కలసి సినిమా చేయాలనీ నాకు చాలా ఉత్సాహంగా వుంది.

ఈ మధ్య దర్శకులు సెట్స్ లో డైలాగులు రాస్తన్నారని అన్నారు కదా ? ఇది చాలా వైరల్ అయ్యింది .. దాని గురించి?
ఈ మధ్య అనలేదండీ. నేను జనరల్ గా ఆ మాట అన్నాను. కానీ దానిని వేరేలా ఆపాదించుకున్నారు. నేను ఏ సినిమాని ఉద్దేశించి ఆ మాట చెప్పలేదు. జనరల్ గా ఇలాంటి పరిస్థితి వుందని చెప్పడమే నా ఉద్దేశం. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా అద్భుతమైన ప్రీప్రొడక్షన్ వర్క్ చేశారు. దిని వలన సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి.

సల్మాన్ ఖాన్ గారు గాడ్ ఫాదర్ చేశారు కదా మీకూ వేరే పరిశ్రమ నుండి అవకాశం వస్తే చేస్తారా ?
తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుతాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా ‘ఇండియన్ సినిమా’ అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జీ ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం.

చాలా విషయంలో తగ్గితే తప్పేంటనే విధానం ముందుకు వెళ్తారు కదా.. కానీ అభిమానులకు మీరు తగ్గడం ఏమిటనే అభిప్రాయం వుంటుంది. దినిని ఎలా చూస్తారు ?

ఇక్కడ తగ్గడం అని కాదు. సంయమనం పాటించడం. నిజాలు నిలకడగా తేలుస్తుందనే మాటని నమ్మేవాడిని నేను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్ళీ వారి తప్పుని తెలుసుకొని నా దగ్గరికి వస్తే వారిని ప్రేమగా దగ్గర తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.